English | Telugu

రెస్టారెంట్ ఓపెనింగ్ లో ఆది


హైపర్ ఆది ఏ షోలో ఉంటె ఆ షో పంచ్ డైలాగ్స్ కి పెట్టింది పేరు. ఆ షో రేటింగ్ కూడా అంతేలా పెరిగి పోతూ ఉంటుంది. బుల్లితెర మీద తిరుగులేని స్టార్ డం తో దూసుకుపోతున్నాడు. స్మాల్ స్క్రీన్ పై హైపర్ ఆది అంటే ఒక బ్రాండ్ అని చెప్పొచ్చు. ఆది వేసే పంచ్‌లు సెటైర్లు, ప్రాసలతో వేసే పంచ్‌లు మస్త్ పేలుతూ ఉంటాయి. అటు బుల్లితెర, ఇటు వెండితెర రెండింటిని సింగల్ హ్యాండ్ తో మ్యానేజ్ చేస్తున్నాడు. అటు వెండితెర నుంచి ఆదికి మెగా సపోర్ట్ కూడా ఉంటుంది. మెగా ఫ్యాన్స్ ఆదిని ప్రేమిస్తుంటారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్ కూడా ఆది చెప్పలేనంత అభిమానం. అందుకే జనసేన కోసం ఎక్కువగా కష్టపడుతుంటాడు. ఆ అభిమానంతో జనసేన నుంచి పోటీ కూడా చేస్తానని ఛాన్స్ వస్తే అని చెప్పాడు ఆది.

ఇప్పుడు స్మాల్ స్క్రీన్ పై ఆది రాకెట్ లా దూసుకుపోతోన్నాడు. సుధీర్ స్టార్ మా కు వెళ్లిపోయాడు. ఐనా సుధీర్ హవా కూడా కాస్త తగ్గిందని చెప్పొచ్చు. అతని ప్లేస్ లో ఆది, రాంప్రసాద్ ఇప్పుడు ఫుల్ ఫామ్ లో ఉన్నారు. మల్లెమాల షోలకు వచ్చినంత స్టార్ డం స్టార్ మా షోలకు ఉండదు.సుధీర్ లేకపోయేసరికి ఢీ, శ్రీదేవీ డ్రామా కంపెనీలో ఆది ఎదురులేకుండా దూసుకుపోతోన్నాడు. ఈ షోస్ లో తప్ప ఎక్కడ బయట కనిపించని ఆది ఇప్పుడు ఒక మండి ఓపెనింగ్ కి వచ్చి అందరినీ సర్ప్రైజ్ చేసాడు. ఇటీవల ఆది పుత్తూరు వెళ్లి అక్కడ ఒక రెస్టారెంట్ ని ఓపెన్ చేసాడు ఆది. ఇంకా ఆ రెస్టారంట్ అంతా కూడా ఆది ఫాన్స్ తో నిండిపోయింది. ఆది టీమ్ తో సెల్ఫీ లు ఆ హడావిడితో ట్రాఫిక్ కూడా కాసేపు నిలిచిపోయింది. ఇలా ఆది ఇప్పుడు ఓపెనింగ్స్ కి వెళ్లడం స్టార్ట్ చేసినట్లే కనిపిస్తోంది.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.